మంచి చేయకపోతే మాత్రం కేంద్రాన్ని గతంలో కంటే ఎక్కువగా నిలదీస్తాం: ఉదయనిధి స్టాలిన్
- కేంద్ర ప్రభుత్వంతో మాకు భేదాభిప్రాయాలు లేవు
- రాష్ట్రానికి మంచి చేస్తే కేంద్రాన్ని అభినందిస్తాం
- దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వమే కారణం
దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఉదయనిధి ఆరోపించారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యల గురించి చెప్పకుండా... చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ అశాస్త్రీయ కార్యక్రమాలకు పిలుపునిచ్చారని విమర్శించారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం ఇటుకలు తరలించారని... ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఉదయనిధి దుయ్యబట్టారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.