తనపై కేసు నమోదవడంపై దాసరి అరుణ్ కుమార్ స్పందన
- దాసరి అరుణ్ పై పోలీస్ కేసు నమోదు
- కులం పేరుతో దూషించారంటూ నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదు
- తెలియని వ్యక్తికి డబ్బులు ఎలా ఇవ్వాలన్న అరుణ్
అసలు నర్సింహులు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అరుణ్ చెప్పారు. ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసి అడిగారని... ఆయన ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారని తెలిపారు. ఒకవేళ కేసు నమోదైతే పీఎస్ లో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా? అని అన్నారు. నాన్న దగ్గర ఆ వ్యక్తి ఎప్పుడు పని చేశారో కూడా తనకు తెలియదని చెప్పారు. నాన్న సినిమాలకు తాను ఎప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదని తెలిపారు. తనకు తెలియని వ్యక్తికి తాను డబ్బులు ఎలా ఇవ్వాలో తనకు తెలియడం లేదని చెప్పారు. ఈ వ్యవహారం వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అరుణ్ చమత్కరించారు.