శ్రీహరి తనయుడు హీరోగా 'రాసిపెట్టుంటే'
- 'రాజ్ దూత్'తో హీరోగా పరిచయం
- సెట్స్ పై 'కోతి కొమ్మచ్చి' సినిమా
- కరోనా కారణంగా ఆలస్యమైన షూటింగ్
- సి.కల్యాణ్ నిర్మాతగా కొత్త ప్రాజెక్టు
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం మేఘాంశ్ 'రాజ్ దూత్' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. కానీ కష్టపడితే కుర్రాడు నిలబడతాడని అంతా చెప్పుకున్నారు.
ఆ తరువాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'కోతి కొమ్మచ్చి' సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగు దశలోనే ఉంది. కరోనా వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ లోగానే మేఘాంశ్ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.