మంచు విష్ణుకు 110 మంది సభ్యుల మద్దతు ఉంది: సీనియర్ నటుడు మాణిక్
- 'మా' అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలి
- మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి
- లేనిపక్షంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలి
ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ గురించి కొందరు సభ్యులు అసత్య ఆరోపణలు చేశారని... వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మాణిక్ కోరారు. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న మంచు విష్ణుకు 110 మంది సభ్యుల మద్దతు ఉందని... అందువల్ల ఈ ఎన్నికల్లో విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కృష్ణంరాజును కోరుతున్నామని చెప్పారు. లేనిపక్షంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు.