మాకు చెప్పకుండానే ఇబ్రహీంపట్నం సభకు ఏర్పాట్లు.. రేవంత్‌పై సోనియాకు కోమటిరెడ్డి ఫిర్యాదు!
- రేవంత్ తీరుపై మాణికం ఠాగూర్ కూడా అసంతృప్తి
- సభను వాయిదా వేయాలని చెప్పినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కోమటిరెడ్డి
- సభావేదిక మార్పు
మరోవైపు, ఇబ్రహీంపట్నం సభను వాయిదా వేయాలంటూ రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించతలపెట్టిన సభావేదిక స్థలంలో స్వల్ప మార్పు జరిగింది. తొలుత సాగర్ హైవే పక్కన పోలీస్ స్టేషన్ సమీపంలో సభ నిర్వహించాలని నిర్ణయించగా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో అవుటర్ రింగురోడ్డు పక్కన బొంగుళూరు సమీపంలో స్థలాన్ని పరిశీలిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.