యాక్షన్ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్!
- షూటింగు దశలో పవన్ రీమేక్
- మరో ప్రధాన పాత్రలో రానా
- పవన్ బర్త్ డే స్పెషల్ గా ఫస్టు సింగిల్
- 'సంక్రాంతి'కి విడుదల
ఇటీవల పవన్ - రానా కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత పవన్ - నిత్యమీనన్ లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం పవన్ పై హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ పుట్టినరోజు కానుకగా వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ఈ సినిమాను 'సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.