మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన 'శేఖర్'
- 91వ సినిమాగా 'శేఖర్'
- యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
- దర్శకుడిగా లలిత్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
రాజశేఖర్ ఏదో ఆలోచన చేస్తూ అలా రోడ్డుపై నడచుకుంటూ వెళుతున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ ఆయన వయసుకి తగినట్టుగానే ఉంది. ఈ సినిమాలో ఆయన విశ్రాంత పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు. తాజా షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులంతా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
లక్ష్మీభూపాల్ కథను అందించిన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎం.ఎల్.వి. సత్యనారాయణ .. వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాజశేఖర్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.