మరో పవర్ ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి!
- విజయ్ సేతుపతికి విపరీతమైన క్రేజ్
- తెలుగులోను మంచి ఫాలోయింగ్
- కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- హీరోగా సందీప్ కిషన్
ఈ నేపథ్యంలో ఆయన తెలుగులో ఒక భారీ సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా చెబుతున్నారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడని అంటున్నారు. బహుశా అది ప్రతినాయకుడి పాత్రనే అయ్యుంటుందనే టాక్ వివినిపిస్తోంది.
రాజ్ అండ్ డీకే సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను, రంజిత్ నిర్మిస్తున్నారు. భరత్ చౌదరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బలమైన కథాకథనాలు .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.