దాసరి కుమారులు ప్రభు, అరుణ్ లపై కేసు నమోదు
- దాసరికి రూ. 2.10 కోట్ల అప్పు ఇచ్చిన సోమశేఖర్ రావు
- రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు దాసరి కుమారుల అంగీకారం
- డబ్బు అడిగితే చంపేస్తామని బెదిరింపులు
అనంతరం పెద్దల సమక్షంలో 2018 నవంబర్ 13న ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్ లు రూ. 2.10 కోట్లకు బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఆ డబ్బును వారు ఇవ్వకపోవడంతో ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నివాసానికి సోమశేఖర్ రావు వెళ్లారు. డబ్బు చెల్లించాలని అడిగారు. దీంతో, ఇంకోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు ఆయనను హెచ్చరించారు. దీంతో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభు, అరుణ్ లపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.