మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలపై సినీ హీరో సుమంత్ స్పందన
- సుమంత్ రెండో పెళ్లి అంటూ వార్తలు
- పవిత్ర అనే అమ్మాయిని చేసుకుంటున్నట్టు ప్రచారం
- ఖండించిన సుమంత్
- ఓ సినిమాకు సంబంధించిన పెళ్లి కార్డు లీకైందని వెల్లడి
తాను నటిస్తున్న కొత్తం చిత్రం పెళ్లి, విడాకులకు సంబంధించిన కథతో తెరకెక్కుతోందని, ఆ చిత్రం సెట్స్ నుంచి ఓ పెళ్లి కార్డు లీకైందని, దాన్నే అందరూ తన పెళ్లి కార్డు అనుకుంటున్నారని సుమంత్ వివరణ ఇచ్చారు. త్వరలోనే ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతాయని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. కాగా, సుమంత్ కు గతంలో నటి కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు.