ధనుశ్ మూవీ నుంచి రేపు ఫస్టులుక్!
- కార్తీక్ నరేన్ నుంచి మరో చిత్రం
- ధనుశ్ కి 43వ సినిమా
- రేపే ఉదయం 11 గంటలకు రిలీజ్
- మాళవిక మోహనన్ కి ఛాన్స్
కెరియర్ పరంగా ఇది ధనుశ్ కి ఇది 43వ సినిమా. ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారుగానీ, బయటికి చెప్పలేదు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ధనుశ్ సరసన నాయికగా మాళవిక మోహనన్ ను తీసుకున్నారు.
ఇటీవల కాలంలో ధనుశ్ ప్రయోగాత్మక పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమాలు ఆయన క్రేజ్ ను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అందరితోనూ ఆసక్తి ఉంది. ఫస్టులుక్ తోనే ధనుశ్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి మరి.