'బంగార్రాజు'లో నాగ్ సరసన శ్రియ?
- 'బంగార్రాజు'కు రంగం సిద్ధం
- వచ్చేనెలలో షూటింగ్ మొదలు
- చైతూ జోడీగా కృతి శెట్టి
- తెరపైకి శ్రియ పేరు
అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇంతకాలానికి ఇప్పుడు ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఆగస్టు రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య జోడీగా కృతి శెట్టిని ఖాయం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
ఇక నాగార్జున సరసన నాయికగా శ్రియను ఎంపిక చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. నాగ్ సరసన రమ్యకృష్ణ చేయనుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో శ్రియను తీసుకున్నారా? లేదంటే ఇది వేరే పాత్రనా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. గతంలో నాగ్ - శ్రియ కాంబినేషన్లో 'నేనున్నాను' .. 'సంతోషం' హిట్లు ఉన్నాయి.