నా బయోపిక్ అప్పుడే తీయెద్దు: ప్రియాంక చోప్రా
- ప్రియాంక బయోపిక్ తీసేందుకు జరుగుతున్న సన్నాహకాలు
- తాను జీవితంలో సాధించాల్సింది ఇంకా ఉందన్న ప్రియాంక
- అన్నీ సాధించిన తర్వాత బయోపిక్ తీయాలని కోరిన వైనం
ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా స్పందిస్తూ, తన బయోపిక్ ను అప్పుడే తీయవద్దని కోరింది. జీవితంలో తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని... తాను అన్నీ సాధించిన తర్వాత తన బయోపిక్ ను తీయాలని కోరింది. ప్రియాంక ఇటీవలే తన 39వ పుట్టినరోజును లండన్ లో జరుపుకుంది. తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ను ఆమె పెళ్లాడిన సంగతి తెలిసిందే.