రీ షూట్ కి వెళ్లనున్న పవన్ సినిమా?
- మలయాళ రీమేక్ గా పవన్ సినిమా
- ప్రాజెక్టు నుంచి తప్పుకున్న కెమెరామెన్
- మరో కెమెరామెన్ ఎంట్రీ
- సంక్రాంతికి సినిమా విడుదల
ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మూరెళ్ల ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. దాంతో ఆయన స్థానంలోకి రవిచంద్రన్ ను తీసుకోవడం జరిగిందని అంటున్నారు. మళ్లీ మొదటి నుంచి చిత్రీకరణ చేయడమే మంచిదనే అభిప్రాయంతో, దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ముందుగా ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేయాలనుకున్నారు. మరి రీ షూట్ ప్రభావం రిలీజ్ పై పడుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ 'హరి హర వీరమల్లు' చేస్తున్న సంగతి తెలిసిందే.