'శాకుంతలం' సినిమాతో అల్లు అర్జున్ కుమార్తె వెండితెర ఎంట్రీ
- తెరంగేట్రం చేస్తున్న అల్లు అర్హ
- 'శాకుంతలం' చిత్రలో చిన్ననాటి భరతుడి పాత్ర
- అల్లు వారి కుటుంబం నుంచి సినిమాల్లోకి నాలుగో తరం
- గర్వంగా ఉందన్న అల్లు అర్జున్
కాగా, 'శాకుంతలం' సినిమాలో అల్లు అర్హ చిన్ననాటి భరతుడిగా కనిపించనుంది. శకుంతల, దుష్యంతుల కుమారుడే భరతుడు. శకుంతల, దుష్యంతుడి ప్రేమకావ్యాన్ని గుణశేఖర్ 'శాకుంతలం' చిత్ర ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తోంది . దుష్యంతుడిగా కేరళ యాక్టర్ దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.