కరీనా కపూర్ పై ఫిర్యాదు చేసిన క్రిస్టియన్ సంఘాలు
- ఇబ్బందుల్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్
- 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పేరుతో పుస్తకం
- తమ మనోభావాలను దెబ్బతీశారంటూ క్రిస్టియన్ సంఘాల ఆగ్రహం
కరీనా కపూర్ పుస్తకానికి పెట్టిన టైటిల్ తమ పవిత్ర గ్రంథమైన బైబిల్ ని అవమానించేలా ఉందని క్రిస్టియన్ సంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ, సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేయాలని అల్ఫా, ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే తాము ఫిర్యాదు మాత్రమే తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదని చెప్పారు. ఈ కేసు ముంబై పరిధిలోకి వస్తుందని, తమ పరిధిలోకి రాదని ఆయనకు చెప్పామని అన్నారు.