శంకర్ 'మెగా' ప్రాజక్టుకు సాయిమాధవ్ మాటలు!
- శంకర్, చరణ్ కలయికలో భారీ చిత్రం
- పాన్ ఇండియా మూవీగా నిర్మాణం
- జోరుగా సాగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
ఈ కోవలో ఇప్పుడీ చిత్రానికి మరో విశేషం తోడైంది. తెలుగులో భారీ చిత్రాలకు పనిచేస్తూ, స్టార్ రైటర్ గా పేరుతెచ్చుకున్న సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. దీనిపై సాయిమాధవ్ స్పందిస్తూ, 'జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫొటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను..' అంటూ ఆనందంతో శంకర్, చరణ్, దిల్ రాజులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.
ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కథానాయిక పేరును కూడా త్వరలో ప్రకటిస్తారు.