రానా చేతుల మీదుగా 'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్!
- రాజ్ తరుణ్ నుంచి 'స్టాండప్ రాహుల్'
- కథానాయికగా వర్ష బొల్లమ్మ
- ముఖ్యమైన పాత్రలో ఇంద్రజ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఆయన 'స్టాండప్ రాహుల్' అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో సంతూ మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 'రానా' చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. డిఫరెంట్ లుక్ తో రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. ముఖ్యమైన పాత్రల్లో ఇంద్రజ .. మురళీ శర్మ నటించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.