'దృశ్యం' దర్శకుడి '12TH MAN'.. హీరోగా మోహన్ లాల్!
- వరుస విజయాలు
- విభిన్నమైన పాత్రలు
- కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
కథను పట్టుగా అల్లడంలో .. కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో జీతూ జోసెఫ్ కి మంచి అనుభవం ఉంది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా కథను మలుపులు తిప్పడం ఆయన ప్రత్యేకత. అలాంటి జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .. సినిమా పేరే '12TH MAN'. ఆశీర్వాద బ్యానర్ పై ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ .. టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.