వనిత విజయ్ కుమార్ వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేసిన రమ్యకృష్ణ!
- టీవీ షో నుంచి తప్పుకున్న వనిత
- ఓ సీనియర్ నటి కారణంగానే అని వెల్లడి
- ఈ కార్యక్రమానికి రమ్యకృష్ణ హోస్ట్
- వనితకు 10కి 1 మార్కు ఇచ్చిన రమ్య
కాగా, బిగ్ బాస్ జోడిగళ్ కార్యక్రమానికి సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. వనిత చేసిన వ్యాఖ్యలు రమ్యకృష్ణను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు. ఈ షోలో ఓ ఎపిసోడ్ లో వనిత పెర్ఫార్మెన్స్ కు రమ్యకృష్ణ 10 మార్కులకు గాను కేవలం ఒక మార్కు ఇచ్చింది. ఇక వనిత వ్యవహారాన్ని రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించగా... ఇదేమంత పెద్ద విషయం కాదని పేర్కొంది. అయినా, ఆ షోలో ఏం జరిగిందో ఆమెను కూడా అడగాల్సింది అని మీడియాకు సూచించింది..