రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యాయత్నం
- బళ్లారి ఎమ్మెల్యే కుమారుడు శ్రవణ్రెడ్డితో కలిసి కార్ల షోరూం ప్రారంభం
- వ్యాపార లావాదేవీల విషయంలో విభేదాలు
- షోరూంలోనే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం
- పెదవి విప్పని రామచంద్రారెడ్డి
ఇటీవల ఇవి మరింత ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్ కుమార్ షోరూంలోనే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్నేహితులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి ప్రవీణ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు, కుమారుడి ఆత్మహత్యాయత్నంపై కాపు రామచంద్రారెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు.