మమ్ముట్టి హీరోగా 'గ్రేట్ శంకర్' .. టీజర్ రిలీజ్!
- మలయాళంలో 'మాస్టర్ పీస్'
- తెలుగు టైటిల్ 'గ్రేట్ శంకర్'
- కాలేజ్ లెక్చరర్ గా మమ్ముట్టి
- త్వరలోనే థియేటర్లకు
ఈ సినిమాలో మమ్ముట్టి కాలేజ్ లెక్చరర్ గా కనిపిస్తున్నాడు. రౌడీయిజం .. రాజకీయాలను కాలేజ్ క్యాంపస్ లోకి అడుగుపెట్టనీయని లెక్చరర్ గా ఆయన ఈ సినిమాలో నటించాడు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ .. ఉన్నిముకుందన్ పోలీస్ ఆఫీసర్స్ గా ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో పూనమ్ బజ్వా కనిపించనుంది. దీపక్ దేవ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తెలుగు ఆడియన్స్ కి మమ్ముట్టి బాగా తెలుసు. ఇక ఉన్ని ముకుందన్ కూడా పరిచయమే. వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఇటీవల ఇక్కడ క్రేజ్ పెరిగిపోయింది. అందువలన ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారని అనుకోవచ్చు.