అనుష్క సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్!
- 'రా రా కృష్ణయ్య' దర్శకుడితో నవీన్ పోలిశెట్టి
- కీలకమైన పాత్రలో అనుష్క
- మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు
- త్వరలోనే సెట్స్ పైకి
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒక గెస్టురోల్ చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. విజయ్ దేవరకొండ .. నవీన్ పోలిశెట్టి మంచి స్నేహితులు. సినిమా ఫీల్డ్ లోకి రావడానికి ముందు ఇద్దరు కలిసే ప్రయత్నాలు చేశారు .. ఇద్దరు కలిసి నటించారు. ఆ మధ్య నవీన్ పోలిశెట్టి సినిమా వేడుకలో విజయ్ ఒక రేంజ్ లో సందడి చేశాడు కూడా. అందువలన ఈ ప్రచారాన్ని కొట్టేయడానికి లేదు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకి, 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు.