విజయసాయిరెడ్డి గారూ, మీరు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: వర్ల ఎద్దేవా
- సాధన దీక్ష చేపట్టిన చంద్రబాబు
- చంద్రబాబు దీక్షలో జనాలే లేరంటూ విజయసాయి వ్యంగ్యం
- చంద్రబాబు కొవిడ్ నిబంధనలు పాటించారన్న వర్ల
- అందుకే కార్యకర్తలు రాలేదని వివరణ
ఏ2 విజయసాయిరెడ్డి మిడిమిడి జ్ఞానంతో విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్న చంద్రబాబు చేపట్టిన సాధన దీక్ష కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, పరిమిత సంఖ్యలో కొద్దిమందితోనే నిర్వహించారని వివరణ ఇచ్చారు. కార్తకర్తలెవరూ రావొద్దని, ఎవరి నియోజకవర్గంలో వారు దీక్ష చేయాలని ఆదేశించామని, ఈ విషయం కూడా తెలియని మీరు ఒక ఎంపీనా? అంటూ వ్యాఖ్యానించారు.