కొవిషీల్డ్ కు అనుమతిపై ఈయూ వద్ద ప్రస్తావించిన విదేశాంగ మంత్రి జైశంకర్
- ఈయూ దేశాల్లో గ్రీన్ పాస్
- గ్రీన్ పాస్ జాబితాలో కేవలం 4 వ్యాక్సిన్లు
- కొవిషీల్డ్ కు దక్కని చోటు
- కొవిషీల్డ్ తీసుకున్నవారిని అనుమతించని ఈయూ
యూరోపియన్ యూనియన్ గ్రీన్ పాస్ పేరిట కరోనా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ గ్రీన్ పాస్ లో మోడెర్నా, ఫైజర్, వాక్స్ జెవిరా (ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా), జాన్సెన్ (జాన్సన్ అండ్ జాన్సన్) వ్యాక్సిన్లకు మాత్రమే చోటు కల్పించారు. ఈ నాలుగు టీకాలు తీసుకున్నవారు మాత్రమే ఈయూ దేశాల్లో ప్రయాణించేందుకు అర్హులవుతారు.
అయితే, భారత్ లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని యూరప్ దేశాలకు వెళ్లినవారికి ఆంక్షలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది.