అవిక బర్త్ డే స్పెషల్ .. న్యూ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్!
- యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న అవిక
- చైతూ సరసన 'థ్యాంక్యూ'
- కల్యాణ్ దేవ్ జోడీగా మరో సినిమా
- దర్శకుడిగా శ్రీధర్ సీపాన
మళ్లీ ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. వరుసగా అవకాశాలను అందుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యతో పాటు కల్యాణ్ దేవ్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాకి శ్రీధర్ సీపాన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున అవిక పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. కలర్ఫుల్ ఫ్రేమ్స్ లో అవికాను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.