శర్వానంద్ 30వ సినిమాగా 'ఒకే ఒక జీవితం' .. ఫస్టులుక్
- శర్వానంద్ నుంచి మరో చిత్రం
- కథానాయికగా రీతూ వర్మ
- దర్శకుడిగా శ్రీ కార్తీక్
- కీలకమైన పాత్రలో అమల అక్కినేని
ఈ నేపథ్యంలో శర్వానంద్ సరదాగా సాగే ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆ సినిమా పేరే 'ఒకే ఒక జీవితం'. కెరియర్ పరంగా ఇది ఆయనకి 30వ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పల్లెకీ .. పట్టణానికి మధ్య హీరో జీవితం ఎలా సాగింది? ఆయనకి ఎదురైన అనుభవాలు ఎలాంటివి? అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరగనున్నట్టుగా తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అమల అక్కినేని ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.