తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాల్సిందే: వినోద్ కుమార్
- జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచాలని యత్నం
- మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచరు?
- రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని మోదీ అన్నారు
- ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూకశ్మీర్‌కు వర్తించదా?
మరి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఎందుకు కుదరదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని చెప్పారని అన్నారు. అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారని, మరి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూకశ్మీర్‌కు వర్తించదా? అని నిలదీశారు. మోదీ సర్కారు చెబుతోన్న ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.