థర్డ్ వేవ్ ప్రమాదం ఉంది.. లాక్ డౌన్ పొడిగిస్తున్నాం: ఝార్ఖండ్ సీఎం
- ఝార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు
- ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడలేదన్న హేమంత్ సొరేన్
- అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు నో పర్మిషన్
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించబోమని ఝార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సంబంధించి ఈ-పాస్ ఉండాలని సూచించింది. అధికారుల వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది. ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉంచాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భేటీ అయింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా హేమంత్ సొరేన్ మాట్లాడుతూ, ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తున్నామని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇంకా బయటపడలేదని... కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని అన్నారు.