'గాలి సంపత్' దర్శకుడితో సెట్స్ పైకి నాగశౌర్య!
- తాజా చిత్రంగా రానున్న 'లక్ష్య'
- 'వరుడు కావలెను'పై క్రేజ్
- పట్టాలపైకి మరో సొంత ప్రాజెక్టు
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకి, 'గాలి సంపత్'ను తెరకెక్కించిన అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను తెలుగు తెరపైకి పరిచయం చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పై పూర్తిస్థాయి కసరత్తు జరిగిపోయిందట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 'గాలి సంపత్' సరిగ్గా ఆడకపోవడంతో నిరాశకు లోనైన అనీష్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడట. ఇక శ్రీమాన్ అనే దర్శకుడిని కూడా నాగశౌర్య లైన్లో పెడుతున్నాడని చెప్పుకుంటున్నారు.