ఢిల్లీలో రేపటి నుంచి మరిన్ని సడలింపులు
- బార్లను ఓపెన్ చేసేందుకు అనుమతి
- రెస్టారెంట్లకు మరో 4 గంటల అదనపు టైం
- పార్కులు, గోల్ఫ్ క్లబ్బులు, యోగాకూ అనుమతి
మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో బార్లను తెరుచుకోవచ్చని పేర్కొంటూ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. రెస్టారెంట్లను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచొచ్చని పేర్కొంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి అన్నింటినీ తెరిచేస్తే కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.