భారీ చారిత్రక చిత్రంగా 'మరక్కర్' .. రిలీజ్ డేట్ ఖరారు!
- మోహన్ లాల్ నుంచి చారిత్రక చిత్రం
- దర్శకుడిగా ప్రియదర్శన్
- భారీ తారాగణంతో రూపొందిన సినిమా
- ఆగస్టు 12వ తేదీన విడుదల
ఈ సినిమాను 'ఓనమ్' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా వదిలారు. సునీల్ శెట్టి .. యాక్షన్ కింగ్ అర్జున్ .. ప్రభు .. కీలకమైన పాత్రలను పోషించారు. ఇక ముఖ్యమైన పాత్రల్లో కీర్తి సురేశ్ .. మంజు వారియర్ .. సుహాసిని .. కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం. ఈ సినిమా సృష్టించనున్న సంచలనం గురించే మోహన్ లాల్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.