ఏపీలో కొవిడ్ కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు
- ఉదయం 6 నుంచి సా.6 గంటల వరకు సడలింపు
- ఈ నెల 21 నుంచి అమల్లోకి సడలింపు
- సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి
- తూ.గో.జిల్లాలో ఉ.6 నుంచి మ.2 వరకే సడలింపు
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని వివరించారు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపారు. తాజా సడలింపులు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వివరించారు.