సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హిందీ సినిమా షూటింగులో రష్మిక
- నాగార్జున, కాజల్ చిత్రం అప్ డేట్
- 'ఛత్రపతి' రీమేక్ కోసం భారీ సెట్స్
* నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ తదుపరి షెడ్యూలు షూటింగ్ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
* తెలుగులో హిట్టయిన 'ఛత్రపతి' చిత్రాన్ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. వీవీ వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల 10 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం నగర శివారులో ఓ భారీ విలేజ్ సెట్ ను వేస్తున్నారు.