అనిల్ రావిపూడి సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య!
- బాలకృష్ణ తాజా చిత్రంగా 'అఖండ'
- తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో
- 'క్రాక్' టీమ్ తోనే పట్టాలపైకి
- లైన్లో అనిల్ రావిపూడి ఉన్నాడన్న బాలయ్య
దాంతో ఈ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అభిమానులు కాస్త నిరాశకి లోనయ్యారు. అది గ్రహించిన బాలకృష్ణ ఈ విషయంలో వాళ్లకి క్లారిటీ ఇచ్చారు. అభిమానులతో జూమ్ మీట్ నిర్వహించిన బాలకృష్ణ, త్వరలో అనిల్ రావిపూడితో తన సినిమా ఉండనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు లైన్లోనే ఉందనే విషయాన్ని గట్టిగానే చెప్పారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, బాలకృష్ణతో సినిమా చేయనున్నందుకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి బాలకృష్ణ కోసం అనిల్ రావిపూడి ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి.