పవన్ కోసం వెయిటింగ్ అంటున్న హరీశ్ .. బండ్ల!
- గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్
- పవన్ ను మళ్లీ ఒప్పించిన హరీశ్
- ఉత్సాహం చూపుతున్న బండ్ల గణేశ్
అయితే సెట్స్ పై ఉన్న క్రిష్ .. సాగర్ చంద్ర ప్రాజెక్టులను పూర్తిచేసిన తరువాతనే పవన్ ఈ సినిమాను చేయనున్నాడు. కరోనా కారణంగా ఈ విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ ఆలస్యాన్ని భరించలేకపోతున్నట్టుగా హరీశ్ శంకర్ ఒక ట్వీట్ చేశాడు. పవన్ తో మళ్లీ వర్క్ చేసే సమయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టుగా చెప్పాడు. ఇక తన పరిస్థితి కూడా అలాగే ఉందంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. ఆయన కూడా పవన్ తో ఒక సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.