బాలయ్య పుట్టినరోజు సందర్భంగా 'అఖండ' నుండి కొత్త పోస్టర్ రిలీజ్
- రేపు బాలకృష్ణ పుట్టినరోజు
- ముగింపు దశలో 'అఖండ'
- దసరాకి విడుదల చేసే ఛాన్స్
- త్వరలో సెట్స్ పైకి కొత్త ప్రాజెక్టు
భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తూ ఉండగా, ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా చేస్తున్నాడు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. విభిన్నమైన లుక్స్ తో బాలకృష్ణ కనిపించే ఈ సినిమాను, దసరా సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఆ తరువాత సినిమాను గోపీచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే.