సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఓటీటీ ద్వారా కీర్తి సురేశ్ సినిమా
- 'అఖండ' నిర్మాతలు ఫిక్సయ్యారట!
- అమితాబ్ తో వర్మ మరో ప్రాజక్టు
* నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ' విజయదశమికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని నిర్మాతలు తాజాగా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో షెడ్యూల్ షూటింగ్ మిగిలివుంది.
* ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి నటించనున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతున్నట్టు, వచ్చే ఏడాది ఇది సెట్స్ కు వెళ్లనున్నట్టు సమాచారం.