'నరకాసురన్' రిలీజ్ ఓటీటీలోనే!
- కార్తీక్ నరేన్ దర్శకత్వంలో 'నరకాసురన్'
- నిర్మాతగా గౌతమ్ మీనన్
- ఆర్ధిక సమస్యల కారణంగా జాప్యం
- సోనీ లైవ్ ద్వారా రిలీజ్
ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా, గౌతమ్ మీనన్ కి గల ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా విడుదల ఆలస్యమైంది. మూడేళ్లు అవుతున్నా ఈ సినిమా రాకపోవడంతో ఇక విడుదల కాదనే అనుకున్నారు. కానీ గౌతమ్ మీనన్ తనకి గల ఆర్ధికపరమైన సమస్యలను ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఓటీటీలో రిలీజ్ అయ్యేలా చూసుకున్నాడు.
'సోనీ లైవ్' ద్వారా ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కానున్నట్టు చెబుతున్నారు. సందీప్ కిషన్ .. అరవింద్ స్వామి .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను 'నరకాసురుడు' పేరుతో పలకరించనుంది.