రవితేజ హీరోగా సినిమా నిర్మిస్తున్న రామ్ చరణ్?
- మలయాళంలో హిట్ కొట్టిన 'డ్రైవింగ్ లైసెన్స్'
- తెలుగు రీమేక్ రైట్స్ చరణ్ చేతికి
- హీరోగా తెరపైకి రవితేజ పేరు
అలాంటి సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ లో చరణ్ చేస్తాడా? లేదంటే పవన్ చేస్తాడా? అనే విషయంపై చర్చలు బాగానే నడిచాయి. అయితే ఈ రీమేక్ లో చరణ్ గానీ .. పవన్ గాని చేయడం లేదు. మరి ఎవరు చేస్తున్నారు? అనే ప్రశ్నకి సమాధానంగా రవితేజ పేరు వినిపిస్తోంది. చరణ్ నిర్మాణంలోనే ఈ సినిమా రూపొందుతుందట. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన సినిమాలో రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు. ఇక అక్కడ సూరజ్ చేసిన పాత్రకిగాను రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.