తెలంగాణలోనూ ఏపీ తరహా కొవిడ్ చర్యలు తీసుకోవాలి: హైకోర్టును ఆశ్రయించిన కోమటిరెడ్డి
- కొవిడ్ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి
- రోగులను ప్రైవేటు ఆసుపత్రులు పీడిస్తున్నాయని ఆరోపణ
- ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని డిమాండ్
- రోగుల ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టీకరణ
- హైకోర్టులో పిల్ దాఖలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారని కోమటిరెడ్డి వెల్లడించారు. అదే సమయంలో కొవిడ్ వ్యాప్తిని తమకు అనుకూలంగా మార్చుకున్న ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని తన పిల్ లో ఆరోపించారు.
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేటు ఆసుపత్రులు దయాదాక్షిణ్యాలు ప్రదర్శించడంలేదని, రోగుల పట్ల సానుభూతే లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.