ఆనందయ్యకు మద్దతుగా నిలిచిన జగపతిబాబు
- తల్లి ప్రకృతి ఆనందయ్య రూపంలో వచ్చిందనిపిస్తోంది
- ఆయన మందుకు అధికారిక అనుమతులు రావాలి
- ఆ మందు ఈ ప్రపంచాన్ని కాపాడాలి
ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోందని జగపతిబాబు అన్నారు. ఆయన మందుకు అధికారిక అనుమతులు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన మందు ఈ ప్రపంచాన్ని కాపాడాలని... ఆ విధంగా భగవంతుడు ఆయనను ఆశీర్వదించాలని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.