అత్యాచారం కేసులో తరుణ్ తేజ్ పాల్ ను నిర్దోషిగా ప్రకటించిన గోవా కోర్టు
- తనను వేధించారని తేజ్ పాల్ పై మహిళ ఫిర్యాదు
- తేజ్ పాల్ పై అత్యాచారం, వేధింపుల కేసు
- కేసును కొట్టేసిన గోవా కోర్టు
తేజ్ పాల్ పై ఆరోపణలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. తేజ్ పాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, గోవా కోర్టులోనే విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేథ్యంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవా కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం కేసును కొట్టేసింది.