మరోసారి వరుణ్ తేజ్ జోడీగా సాయిపల్లవి?
- 'ఫిదా'ను మరిచిపోని ప్రేక్షకులు
- తెరపై మళ్లీ కనిపించనున్న జంట
- దర్శకుడిగా వెంకీ కుడుముల
- మరో ప్రేమకథకి సన్నాహాలు
ప్రేమకథా చిత్రాలను యూత్ మెచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకీ కుడుముల తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. 'ఛలో' .. 'భీష్మ' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇటీవల ఆయన వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవినే సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం. ఇటు వెంకీ కుడుముల .. అటు వరుణ్ ఇద్దరూ హిట్ల మీదే ఉన్నారు. అందువలన ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 'గని' తరువాత వరుణ్ చేసే ప్రాజెక్ట్ ఇదేనని అంటున్నారు.