సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తమన్నా వెబ్ సీరీస్ 'నవంబర్ స్టోరీ'
- ప్రభాస్ సినిమాలో హాలీవుడ్ నటి?
- త్రివిక్రమ్ చిత్రంలో కీలక పాత్రలో సుమంత్
* ప్రస్తుతం 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలలో నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో మరో బాలీవుడ్ చిత్రంలో కూడా నటించనున్నాడు. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ ప్రధాన చిత్రంలో ఓ కీలక పాత్రకు హాలీవుడ్ నటిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
* మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఇందులో ఓ కీలక పాత్రకు గాను అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.