విజయ్ నటించే తెలుగు సినిమాకి భారీ పారితోషికం!
- 65వ సినిమాతో విజయ్
- నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో
- నిర్మాతగా దిల్ రాజు
- 175 కోట్ల బడ్జెట్ అంటూ టాక్
తరువాత సినిమాను వంశీ పైడిపల్లితో విజయ్ చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదల కానున్నట్టుగా చెప్పుకున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడని అన్నారు. అయితే ఇది నిజమా? కాదా? అని అనుకునేంతలో మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను దాదాపు 175 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారనీ .. పారితోషికంగా విజయ్ కి 50 కోట్లకి పైనే ముట్టనుందని అంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.