కరోనా బాధితులకు చేయూత.. భార్య అనుష్క శర్మతో కలిసి ముందుకొచ్చిన కోహ్లీ.. రూ.2 కోట్ల సాయం ప్రకటన
- దేశంలో అనేక మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు
- మన ఆరోగ్య వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటోంది
- అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి
- కెట్టో స్వచ్ఛంద సంస్థ ద్వారా విరాళాలు ఇవ్వండి
మన ఆరోగ్య వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటున్న వేళ అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. కెట్టో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎంతో కొంత సాయం చేయాలని కోరారు. తమ ఉద్యమంలో అందరూ చేరాలని కోరారు. కెట్టోకు విరాళాలు పంపాలని, దాని ద్వారా కరోనా రోగులకు సాయం చేయొచ్చని వారు విజ్ఞప్తి చేశారు.