'పుష్ప' టీజర్ ఆల్ టైమ్ రికార్డ్
- స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
- టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- ఫారెస్టు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్
ఇక ఇప్పుడు 60 మిలియన్ వ్యూస్ ను .. 1.4 మిలియన్ లైక్స్ ను రాబట్టి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఇంతవరకూ తెలుగులో ఒక టీజర్ కి ఈ స్థాయి వ్యూస్ .. లైక్స్ రావడం ఇదే మొదటిసారి. బన్నీ ఖాతాలో ఈ రికార్డు చేరడంతో ఆయన అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఫారెస్టులోని యాక్షన్ సీన్స్ .. ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.