శివం మావి బౌలింగ్లో పృథ్వీ షా ఆరు ఫోర్లు.. మ్యాచ్ ముగిశాక మావి ప్రతీకారం!
- నా బౌలింగులోనే ఫోర్లు కొడతావా అంటూ పృథ్వీ షా మెడ పట్టుకున్న మావి
- వైరల్ అవుతున్న వీడియో
- మ్యాచ్ ముగిసింది.. ఫ్రెండ్షిప్ మొదలైందన్న ఐపీఎల్
మ్యాచ్ ముగిసిన తర్వాత పృథ్వీ షా వద్దకు వచ్చిన శివమ్ మావి తన బంతులను బౌండరీలకు తరలించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. సరదాగా అతడి మెడను అదిమిపట్టుకున్నాడు. ఈ వీడియోను ఐపీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘మ్యాచ్ ముగిసింది.. ఫ్రెండ్షిప్ మొదలైంది. ఐపీఎల్ గొప్పతనం ఇదే’’ అని క్యాప్షన్ తగిలించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.