పవన్ కోసం కథ రెడీ చేస్తున్న 'వకీల్ సాబ్' దర్శకుడు!
- పవన్ తో దిల్ రాజుకు పెరిగిన సాన్నిహిత్యం
- ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా
- కథలపై దర్శకుల కసరత్తు
పవన్ తో దిల్ రాజు మరో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా పవన్ కు చేరిందనే టాక్ వచ్చింది. ఈ సినిమా కోసం మంచి కథను రెడీ చేయమని ఇద్దరు ముగ్గురు దర్శకులతో దిల్ రాజు చెప్పారట. అందులో 'వకీల్ సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఉన్నాడు. పవన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనే విషయం వేణు శ్రీరామ్ పట్టేశాడు. అందువలన అందుకు తగిన కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. పవన్ ను ఒప్పించేలా కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.